Zaheer Khan: మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రయ్యారు 7 d ago

featured-image

మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రయ్యారు. ఆయన సతీమణి, నటి సాగరిక ఖాన్ మగబిడ్డకు జన్మనిచ్చారు. కుమారుడికి 'ఫతే సింహ్ ఖాన్' అని పేరు పెట్టారు. ఈ శుభవార్తను బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మాతృత్వ ప్రయాణాన్ని ఇంత కాలం దాచి ఉంచిన ఈ జంట, చిన్నారి ఫొటోతో సర్ప్రైజ్ ఇచ్చారు. 2016లో యువరాజ్ సింగ్ పెళ్లి వేడుకలో పాల్గొన్న‌ వీళిద్దరూ తమ ప్రేమబంధాన్ని బయట పెట్టారు. ఈ జంట 2017లో వివాహం చేసుకున్నారు. జహీర్ ప్రస్తుతం ఐపీఎల్‌లో లఖ్నవూ జట్టుకు మెంటార్‌గా ఉన్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD